న్యూఢిల్లీ : దేశీ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ బోట్ వేవ్ ఫ్యురితో (boAt Wave Fury) కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ 30 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ సపోర్ట్, 1.83 హెచ్డీ డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. రూ. 1299 ప్రారంభధరతో న్యూ వేవ్ ఫ్యురీ స్మార్ట్ వాచ్ యాక్టివ్ బ్లాక్, బ్లూ, మెటాలిక్ బ్లాక్, చెర్రీ బ్లాజమ్, టీల్ గ్రీన్ వంటి ఐదు కలర్స్‌లో అందుబాటలో ఉంది.
ఈ స్మార్ట్‌వాచ్‌ను యూజర్లు ఫ్లిప్‌కార్ట్.కాం లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ బోట్-లైఫ్‌స్టైల్.కాం నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక యాపిల్ వాచ్ సిరీస్ తరహాలో బోట్ ఫంక్షనల్ డిజిటల్ క్రౌన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో వాచ్ స్క్రీన్, వాచ్ ఫేస్ ఛేంజింగ్, సెట్టింగ్స్ మేనేజ్ చేయడం వంటివి క్రౌన్‌ను సింపుల్ ట్విస్ట్ చేయడం ద్వారా సరళంగా చేపట్టవచ్చు.
బోట్ వేవ్ ప్యురి ఏడాది వారంటీతో కస్టమర్ల ముందుకొచ్చింది. ప్రీమియం ఈస్ధటిక్స్తో పాటు హెల్త్, ఫిట్నెస్ ట్రాక్ చేసే ఫీచర్లను కోరుకునే వారికి బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ మేలేన ఎంపికగా చెబుతున్నారు. హార్ట్‌రేట్ మానిటరింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి పీచర్లతో పాటు ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం 50 స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌వాచ్ ముందుకొచ్చింది.
Read More :