Best Smartphones | ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం. అయినా కొత్తగా స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలని భావించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో వచ్చేస్తున్న స్మార్ట్ ఫోన్లు బిగ్ డిస్ ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. కానీ, ఈ ఏడాది డిస్ ప్లే, బ్యాటరీ లైఫ్ అంతకంటే మెరుగ్గా ఉంటున్నాయి. దాదాపు దేశమంతా 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ ఫోన్లన్నీ 5జీ కనెక్టివీటీతోపాటు హై రీఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో వస్తున్నాయి. వాటిల్లో బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉన్న ఫోన్ల గురించి తెలుసుకుందాం..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో రిలీజ్ చేసిన పొకో సీ51 ఫోన్ కేవలం రూ.6,999లకే లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు మీడియా టెక్ హెలియో జీ36 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్-13 వర్షన్ మీద పని చేస్తుంది.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ.. భారత్ మార్కెట్లోకి ఎంట్రీ లెవెల్ ఫోన్ రియల్ మీ నార్జో55 తీసుకొచ్చింది. దీని ధర రూ.8,999 ఉంటది. యూనిసోక్ టీ612 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీ విత్ 33 వాట్ల చార్జర్ తో వచ్చింది.
రియల్ మీ నార్జో ఎన్53 మాదిరిగానే లావా యువ2 ప్రో ఫోన్ కూడా ఐ-ఫోన్ మాదిరిగా రేర్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నది. గ్లాస్ రేర్ ప్యానెల్ కలిగి ఉంటది. 6.5 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో వస్తుంది. మీడియా టెక్ హెలియో జీ37 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. ఈ ఫోన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల సపోర్ట్ కలిగి ఉంటది.
రియల్ మీ సీ 55 ఫోన్ రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ సైతం ఆపిల్ ఐ-ఫోన్ 10 ప్రో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్-13 వర్షన్ మీద పని చేస్తుంది.
మోటరోలా మరో ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఫోన్ మోటో ఈ13 అత్యంత చౌక ధరకే లభిస్తుంది. 4జీ రామ్ విత్ యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. డ్యుయల్ బాండ్ వై-ఫై సౌకర్యం, టైప్-సీ యూఎస్బీ పోర్ట్, ఎఫ్ఎం రేడియో ఫీచర్ ఉంటాయి.