Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 దీపావళి వరకు కొనసాగనుంది. తాజాగా దీపావళి
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021 దీపావళి వరకు కొనసాగనుంది. తాజాగా దీపావళి సందర్భంగా అమెజాన్ సేల్‌లో లాప్టాప్ల మీద బెస్ట్ డీల్స్ అందిస్తోంది అమెజాన్. ఇప్పుడు లాప్టాప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల దగ్గర్నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ వరకు అన్నింటికీ లాప్టాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే.. అమెజాన్ తాజాగా పలు కంపెనీల లాప్టాప్ల మీద భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. హెచ్‌పీ, డెల్, అసుస్ కంపెనీలకు చెందిన లాప్‌టాప్‌లపై పలు ఆఫర్లను అందిస్తోంది.

అసుస్ కంపెనీకి చెందిన వివో బుక్ 14 మీద భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ లాప్టాప్ ఎంఆర్పీ ధర రూ.63,990 కాగా.. అమెజాన్ సేల్‌లో రూ.47,990కే అందిస్తున్నారు. 14 ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఉన్న ఈ లాప్టాప్ ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది.
డెల్ 15
డెల్ 15 ఎంఆర్పీ ధర రూ.56,776 కాగా.. డిస్కౌంట్లో రూ.41,990కే ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు ఇంటెల్ కోర్ ఐ3 11వ జనరేషన్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ ఇంటర్నల్ స్టోరేజీ లాంటి ఫీచర్లు ఈ లాప్టాప్లో ఉన్నాయి.
హెచ్‌పీ 15
15.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఏఎండీ రైజెన్ 3 3250యూ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ ప్రాసెసర్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్లు ఉన్న ఈ లాప్టాప్ ఎంఆర్పీ ధర రూ.46,055 కాగా రూ.38,990కే అమెజాన్ సేల్‌లో అందిస్తున్నారు.
లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3(ఇంటెల్)
లెనోవో లాప్టాప్ ఎంఆర్పీ ధర రూ.55,890 కాగా రూ.36,490కే లాప్‌టాప్‌ను అందిస్తున్నారు. లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3 లాప్టాప్.. 15.6 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10వ జనరేషన్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ, ప్రైవసీ షట్టర్, డుయల్ అర్రే మైక్రోఫోన్, డాల్బీ ఆడియోతో రెండు 1.5 వాట్స్ హెచ్డీ స్టీరియో స్పీకర్స్ ఈ లాప్టాప్లో ఉన్నాయి.
అలాగే.. లెనోవో ఐడియాపడ్ స్లిమ్ 3 లాప్టాప్.. ఏఎండీ ప్రాసెసర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ఎంఆర్పీ ధర రూ.43,990 కాగా రూ.36,990కే అందిస్తున్నారు.
డెల్ ఇన్సిపిరాన్ 3501
డెల్ ఇన్సిపిరాన్ 3501 లాప్టాప్ 15.6 ఇంచ్ ఫుట్ హెచ్డీ యాంటీ గ్లేర్ ఎల్ఈడీ డిస్ప్లేతో పాటు ఇంటెల్ కోర్ ఐ3 10వ జనరేషన్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీతో పాటు ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్, విండోస్ 10 హోమ్‌ను కలిగి ఉండే ఈ లాప్ టాప్ ఎంఆర్పీ ధర రూ.44,634 కాగా రూ.38,490 కే అందిస్తున్నారు.
హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్360
హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్360 మోడల్ లాప్టాప్లో 14 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10వ జనరేషన్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఎస్ఎస్డీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎంఆర్పీ ధర రూ.57,610 కాగా.. రూ.38,990కే అమెజాన్ సేల్‌లో అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Smallest Game console : ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
Telegram : సరికొత్త చరిత్ర సృష్టించిన టెలిగ్రామ్.. వాట్సాప్ కు దీటుగా..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

