Apple | మాస్ లేఆఫ్స్‌కు యాపిల్ విముఖత : ట్రావెల్ బడ్జెట్లో కోత..ప్రమోషన్లలో జాప్యం
ఖర్చులను తగ్గించుకునేందుకు పలు టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా లేఆఫ్స్‌ను తప్పించేందుకు యాపిల్ (Apple) ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
న్యూయార్క్ : ఖర్చులను తగ్గించుకునేందుకు పలు టెక్ కంపెనీలు మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతుండగా లేఆఫ్స్‌ను తప్పించేందుకు యాపిల్ (Apple) ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ప్రతికూల ఆర్ధిక పరిస్ధితుల్లో మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు పాల్పడగా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు యాపిల్ సుముఖంగా లేదు.
ఈ ఆర్ధిక సంవత్సరం తుది త్రైమాసంలో యాపిల్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం పతనమై 117 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. లేఆఫ్స్‌ను తప్పించేందుకు ట్రావెల్ బడ్జెట్లో కోత విధించడం, కార్పొరేట్ ఉద్యోగుల్లో కొందరికి బోనస్‌ల జారీలో జాప్యం, హైరింగ్‌ను కుదించడం వంటి ప్రత్యామ్నాయాలను యాపిల్ అనుసరిస్తుందని యాపిల్ అనలిస్ట్, బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ పేర్కొన్నారు.
ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ సరఫరాల అంశం పరిష్కారం కావడంతో యాపిల్ రాబడి ప్రస్తుత క్వార్టర్లో మెరుగుపడుతుందని అంచనా వేశారు. లేఆఫ్స్ కొనసాగితే అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్ధ ప్రజలు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉందనే సంకేతాలు వెల్లడవుతాయని మార్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
మాస్ లేఆఫ్స్‌ను నివారించేందుకు యాపిల్ తన న్యూజెన్ హోమ్‌ప్యాడ్ తయారీలో జాప్యం చేస్తోంది. అనివార్యమైన ప్రాజెక్టులపైనే తన పరిశోధన, అభివృద్ధి నిధులను వెచ్చించాలని యాపిల్ భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొందరు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సి ఉండగా వాటిని అక్టోబర్‌కు వాయిదా వేసింది.
Read More :
Meta-Blue Tick | ట్విట్టర్ బాటలోనే మెటా.. ఆ రెండు ఖాతాలకు మనీ పే చేస్తేనే బ్లూ టిక్!
Foldable I-Phone | కింద పడ్డా నో ప్రాబ్లం.. స్క్రీన్ డ్యామేజీలేని ఫోల్డబుల్ ఐ-ఫోన్.. 2025లో మార్కెట్లోకి?!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- Apple
- layoffs
- travel budget
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

