Meta-Blue Tick | ట్విట్టర్ బాటలోనే మెటా.. ఆ రెండు ఖాతాలకు మనీ పే చేస్తేనే బ్లూ టిక్!
Meta-Blue Tick | ట్విట్టర్ బాటలోనే ఫేస్బుక్ పేరెంట్ సంస్థ మెటా పయనించనున్నది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు మనీ పే చేసిన వారికి బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇస్తున్నది. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న ఈ పాలసీ, త్వరలో ప్రపంచ దేశాల్లో తీసుకురానున్నది.
Meta-Blue Tick | గతేడాది సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను టేకోవర్ చేశాక ఎలన్‌మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెరిఫైడ్ అకౌంట్స్‌కి ఇచ్చే బ్లూ టిక్ వెరిఫికేషన్ జనరల్ యూజర్లకూ అందుబాటులోకి తెచ్చారు. వారు నెలవారీ ఫీజు చెల్లించి తమ అకౌంట్‌కు బ్లూ టిక్ వెరిఫికేషన్ అందుకోవచ్చు. ఇదే పాలసీని ఫేస్బుక్ పేరెంట్ బాడీ మెటా అమల్లోకి తెచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ సోషల్ మీడియా అకౌంట్లకు బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చు.
ఇంతకుముందు మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్రభావ శీలురు, ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు నిబంధన సడలించింది మెటా. సాధారణ వ్యక్తులెవరైనా నెలవారీ ఫీజు పే చేసి బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చునని తెలిపింది.
మెటా బ్లూ టిక్ ఫీచర్ ఇప్పటికైతే అమెరికా యూజర్లకే అందుబాటులో ఉంది. వెబ్ వర్షన్‌పై 11.99 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.990), మొబైల్ యాప్ వర్షన్లో వాడితే 14.99 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.1230) పే చేస్తే సరిపోతుంది. అంతే కాదు వెబ్ వర్షన్‌కు ఫీజు పే చేసిన యూజర్లకు ఫేస్బుక్లో మాత్రమే బ్లూ టిక్ వస్తుంది. మొబైల్ వర్షన్ యూజర్లు మాత్రమే రెండు అకౌంట్స్‌లోనూ బ్లూ టిక్ పొందొచ్చు.
నెలవారీ ఫీజు పే చేసిన వారు నేరుగా కస్టమర్ సపోర్ట్ డైరెక్ట్ యాక్సెస్, ప్రత్యేక స్టిక్కర్లు, నెలకు వంద స్టార్లు అదనంగా అందుకుంటారు. లైవ్ స్ట్రీమ్ చేసే వారికి మద్దతుగా యూజర్లు వర్చువల్ గిఫ్ట్‌లుగా ఈ స్టార్లు పంపుతారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ సౌకర్యం పొందాలంటే సదరు వ్యక్తి వయస్సు 18 ఏండ్లు దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లూ టిక్ వెరిఫికేషన్ లభించిన వారు ఏ ఫీజు చెల్లించనవసరం లేదు. త్వరలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ ఫీచర్ అమల్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నది మెటా.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

