న్యూఢిల్లీ : లేఆఫ్స్ సీజన్ (Layoffs) ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. వ్యయ నియంత్రణ చర్యల పేరుతో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూనే ఉన్నాయి. సైబర్‌సెక్యూరిటీ కంపెనీ బిషప్ ఫాక్స్ కంపెనీలోని 13 శాతం సిబ్బందిని తొలగించింది. కంపెనీలో 50 మంది ఉద్యోగులపై వేటు వేసిందని టెక్‌క్రంచ్ పేర్కొంది. బిషప్ ఫాక్స్ ఇటీవల తమ ఉద్యోగులకు భారీ పార్టీని ఏర్పాటు చేసి బ్రాండెడ్ డ్రింక్స్‌ను సర్వ్ చేసింది.
బ్లాక్ హ్యాట్, డెఫ్ కాన్ సెక్యూరిటీ సదస్సులు జరిగే వెగాస్‌లో ఈ ఏడాది చివరిలో మరికొన్ని ఈవెంట్లు ప్లాన్ చేశామని బిషప్ ఫాక్స్ ట్వీట్ చేసిన వెంటనే లేఆఫ్స్‌కు తెగబడటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి పరిస్ధితులతో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది.
తమ వ్యాపారం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆర్ధిక మందగమనం నేపధ్యంలో భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమని సైబర్‌సెక్యూరిటీ కంపెనీ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్ధిక పరిస్ధితుల నేపధ్యంలో తాము ఈ మార్పులు చేపట్టామని, అయితే భిన్నమైన గ్లోబల్ ఎకానమీ నేపధ్యంలో మార్కెట్ అనిశ్చితులు, ఇన్వెస్టర్ ట్రెండ్స్‌ను తాము విస్మరించలేమని బిషప్ ఫాక్స్ సీఈవో విన్నీ లి స్పష్టం చేశారు.
Read More
Internet | 50 శాతానికి పైగా ఇండియన్స్ ఇంటర్నెట్ వాడకం.. ఇదే ఫస్ట్ టైం
Pixel 7a | మే 11న భారత్‌లో పిక్సెల్ 7ఏ లాంఛ్..ధర ఎంతంటే..!