5G Smartphones | 2023లో 5జీ ఫోన్లదే హవా.. ఆ సెగ్మెంట్కు ఫుల్ గిరాకీ.. తేల్చేసిన సీఎంఆర్!
5G Smartphones | ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో 5జీ నెట్ వర్క్ ఫోన్లు 45 శాతం వాటా కలిగి ఉంటాయని సీఎంఆర్ తెలిపింది.
5G Smartphones | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. గతేడాది 5జీ సేవలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి నెమ్మదిగా ఎంటరైన 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఈ ఏడాది భారీగా పుంజుకుంటాయని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) అంచనా వేసింది. ఈ ఏడాది చివరికల్లా 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 13 రెట్ల గ్రోత్ నమోదవుతుందని.. 70 శాతం సేల్స్ పెరుగుతాయని పేర్కొంది. రెండేండ్ల క్రితం అంటే 2020లో కేవలం నాలుగు శాతం సేల్ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో 5జీ ఫోన్లకు 45 శాతం వాటా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేకించి రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు స్మార్ట్ ఫోన్లకు ఫుల్ గిరాకీ ఉంటుందని వ్యాఖ్యానించింది.
గతేడాది దాదాపు 100 `5జీ స్మార్ట్ ఫోన్లు` మార్కెట్లోకి వచ్చాయి. నూతనంగా మార్కెట్లో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో 75 శాతం 5జీ సపోర్టెడ్గా ఉంటాయని సీఎంఆర్ వెల్లడించింది. ఇక శ్యామ్సంగ్, వన్ ప్లస్, వివో బ్రాండ్ల ఆధిపత్యమే ఉంటుందని తెలిపింది. షియోమీ, రియల్మీ బ్రాండ్లకు చెందిన రూ.10,000-20,000 క్యాటగిరీ ఫోన్ల సేల్స్ అత్యధికంగా జరుగుతాయని అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ లభ్యతను బట్టి 5జీ స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి. `వినియోగదారులు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని కోరుకుంటారు. 5జీ స్మార్ట్ ఫోన్ల వాడకం దిశగా మొగ్గుతారు. భారతీయ టెల్కో సంస్థల దూకుడుగా 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకొస్తే ఈ ఏడాది 5జీ స్మార్ట్ ఫోన్లకు భారీగా గిరాకీ ఉంటుంది` అని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) అనలిస్ట్ శిప్రా సిన్హా చెప్పారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

