మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 30, 2020 , 02:26:02

పారిశుధ్య కార్మికులకు.. రేయిన్‌కోట్ల పంపిణీ

పారిశుధ్య కార్మికులకు.. రేయిన్‌కోట్ల పంపిణీ

తూప్రాన్‌ రూరల్‌ : వానకాలంలో రేయిన్‌కోట్‌లు ధరించి తమ విధులను నిర్వహించాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌తో కలిసి రేయిన్‌కోట్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు ఉదయం నుంచి సాయం త్రం వరకు వీధులు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగిస్తున్నారని, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తున్నారన్నారు. ప్రజలు ఆరోగ్యవంతమై న జీవన విధానం కొనసాగించడంలో వారి పాత్ర ఎంతైనా ఉందన్నారు. విధి నిర్వాహణలో పారిశుధ్య కార్మికులు వర్షంలో తడువకుండా ఉండటం కోసం రేయిన్‌కోట్లను అందజేశామన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కమిషనర్‌ ఖాజామోజియోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ తూప్రాన్‌ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, సీనియర్‌ నాయకులు జంగం రాములు, అజార్‌, వెంకటేశ్‌యాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, కుమ్మరి రఘుపతి, మామిండ్లకృష్ణ, వెంకట్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo