మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jun 22, 2020 , 23:31:19

యోగాతో దీర్ఘకాల ప్రయోజనాలు

యోగాతో దీర్ఘకాల ప్రయోజనాలు

  • కలెక్టరేట్‌లో యోగాసనాలు వేసిన కలెక్టర్‌  ధర్మారెడ్డి 

మెదక్‌ : యోగా వెలకట్టలేనిదని, ఇది భారతదేశ అమూల్యమైన సంప్రదాయమని  కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. పాఠశాలల్లో ప్రతి రోజు విద్యార్థులకు యోగా, ధాన్యం నేర్పించాలని డీఈవో రమేశ్‌కుమార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ జిల్లా సమన్వయకర్త నాగరాజు, డీఈవో రమేశ్‌కుమార్‌, వ్యా యామ ఉపాధ్యాయులు రవి, జోత్స్న, దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శిక్షకులు శ్యామ్‌, సెక్టోరియల్‌ అధికారి సుభాశ్‌ తదితరులు ఉన్నారు. 


logo