మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Feb 10, 2020 , 23:13:18

40 వార్డులు ఏక్రగ్రీవం

40 వార్డులు ఏక్రగ్రీవం

కాగజ్‌నగర్‌ రూరల్‌ : కాగజ్‌నగర్‌ వ్యవసాయ సహకార పరపతి సంఘం కొత్తపేట ఎన్నికల్లో 13 మంది డైరెక్టర్లు సోమవారం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. పీఏసీఎస్‌ పరిధిలో 13 వార్డులకు 28 మంది నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరివి తిరస్కరణ కాగా 26 మంది పోటీలో ఉన్నారు. చివరి రోజు 13 మంది ఉపసంహరించుకోగా 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఒకటో వార్డులో సమ్మెట ఉమామహేశ్వర్‌రావు, రెండో వార్డు కాసర్ల మహిపాల్‌రెడ్డి, మూడో వార్డు కేకర్‌ నానాజీ, నాలుగో వార్డు ఉలికల బాపు, ఐదో వార్డు బీమన్‌కార్‌ పోచయ్య, ఆరో వార్డు చౌదరి పద్మ, ఏడో వార్డు కున్సోత్‌ శ్రీనివాస్‌, ఎనిమిదో వార్డు ఇరిగిరాల శాంత, తొమ్మిదో వార్డు దరని రామయ్య, పదో వార్డు మహ్మద్‌ గులాం సైఫ్‌ అహ్మద్‌, 11వ వార్డు పెద్దింటి వెంకటేశ్వర్‌రావు, 12వ వార్డు చునార్కర్‌ వెంకటయ్య, 13వ వార్డు నగునూరి తిరుపతి గౌడ్‌ ఏకగ్రీవం అయినట్లు పేర్కొన్నారు. 

కౌటాల : గురుడుపేట సహకార సంఘం ఎన్నికల్లో సోమవారం 13 నామినేషన్లు ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారి పాలకుర్తి రాజేశ్‌ తెలిపారు. మొత్తం 13 వార్డులకు మొత్తం 33 నామినేషన్లు దాఖాలయ్యాయి. కాగా ఇందులో 13 నామినేషన్లు ఉపసంహరణ కాగా 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో 3,4,5,6,9,10,13 ఉన్నా యి. బరిలో ఉన్న వాటిలో ఒకటో వార్డుకు ఇద్దరు అభ్యర్థు లు, రెండో వార్డుకు ఇద్దరు, ఏడో వార్డుకు ముగ్గురు, ఎనిమిదో వార్డుకు ఇద్దరు, 11వ  వార్డుకు ఇద్దర, 12వ  వార్డు కు ఇద్దరు అభ్యర్థులు మొత్తం  13 మంది పోటీలో ఉన్నా రు. కాగా 7 నియోజకవర్గాలు ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. ఐటీడీఏ మాజీ డైరెక్టర్‌ కొమురం మాంతయ్య సహకార సంఘ చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం మెండుగా ఉన్నాయి. 

సిర్పూర్‌(టి):  మండలంలోని సహకార ఎన్నికల్లో సోమవా రం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. మొ త్తం 13 వార్డులుండగా 8 వార్డులు  ఏకగ్రీవం కాగా , మిగిలిన 5 వార్డుల్లో 14 మంది బరిలో ఉన్నారు. ఏకగ్రీవమైన వార్డులు 2,5,6,7,8,9, 10, 13,  1,3,4,11,12 వార్డు ల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల గుర్తులను కేటాయించారు.

దహెగాం : మండలంలో సహకార సంఘం నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. దీని పరిధిలో 13 డైరెక్టర్‌ స్థానాలుండగా, 8 స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 5 స్థానాలకు పోటీ నెలకొన్నది. కాగా ఒకటో వార్డు డైరెక్టర్‌ పుల్గం నారాయణ, వార్డు నెంబర్‌ ఎస్‌కే షాకీర్‌, మూడో వా ర్డు రాపర్తి ధనుంజయ్‌, నాలుగో వార్డు తుమ్మిడ దామోదర్‌,  ఏడోవార్డు కుడ్మిత గంగుబాబా, ఎనిమిదో వార్డు సంగర్స్‌ బాలకిషన్‌రావు, తొమ్మిదో వార్డు తాడూరి రజిత, 13 వ వార్డు పెరుగు రూప ఏకగీవ్రమైనట్లు ఎన్నిల అధికారి ఖాదర్‌ హూస్సేన్‌, సీఈవో బక్కయ్యలు తెలిపారు.

ఐదు స్థానాలకు పోటీ..

ఐదు వార్డుల్లో పోటీ నెలకొంది ఐదో వార్డులో కోండ్ర తిరుపతిగౌడ్‌, తెలిగె రామయ్య, ఆరో వార్డుకు అల్గం మల్లేశ్‌, స జీర్‌, పదో వార్డుకు షేక్‌ హైమద్‌ హూస్సేన్‌, షేక్‌ కుర్‌షీద్‌,  11 వార్డుకు రాంటెంకి మల్లేశ్‌, దుండ్ర శ్రీనివాస్‌,12 వార్డు కు తనుకు నారాయణ, గుండేటి సదాశివ్‌ పోటీలో ఉన్నారు. 

బెజ్జూర్‌ :  సహకార ఎన్నికల్లో 13 వార్డుల్లో సోమవారం 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి రాజుల నాయుడు తెలిపారు. కాగా నాలుగో వార్డు మేకల కోటేష్‌, తొమ్మిదో వార్డు పాముల వెంకటి, 10 వ వార్డు టొంబ్రె కమలాకర్‌, 11 వార్డులో పుల్లూరి మనీషా ఏకగ్రీవమయ్యారు. కాగా బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మొదటి స్థానంలో బీరువా గుర్తు, రెండో స్థానం బ్యాటు గుర్తు , మూడో స్థానంలో ఉన్న వారికి టార్చిలైటు గుర్తులు కేటాయించారు. 


logo