OTT Hits | డెజావు (తమిళ చిత్రం) – Dejavu Movie Review
అమెజాన్ ప్రైమ్: నవంబర్ 24
తారాగణం: అరుళ్ నిధి, మధు, అచ్యుత్ కుమార్
దర్శకత్వం: అరవింద్ శ్రీనివాసన్
తమిళంలో వినూత్న కథా చిత్రాల్లో నటిస్తూ ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో అరుళ్ నిధి. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘డెజావు’ తమిళంలో మంచి విజయం సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదలైంది. క్రైమ్ నవలలు రాసే సుబ్రహ్మణ్యం (అచ్యుత్ కుమార్) చుట్టూ కథ తిరుగుతుంది. నవలల్లో తాను సృష్టించిన పాత్రలే తనను భయపెడుతున్నాయంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఇదే సమయంలో డీజీపీ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కేసుతో సుబ్రహ్మణ్యానికి సంబంధం ఉందని పోలీసు విచారణలో తెలుస్తుంది. అయితే సమాజంలో పలుకుబడి, మీడియా అండదండలు ఉండటంతో అతణ్ని అరెస్ట్ చేయలేకపోతారు. ఆ కేసును పోలీస్ అధికారి విక్రమ్ కుమార్ (అరుళ్ నిధి) టేకప్ చేస్తాడు.
విచారణలో విభ్రాంతికర విషయాలు వెలుగుచూస్తాయి. డీజీపీ కూతురు కిడ్నాప్ వెనక సుబ్రహ్మణ్యం పాత్ర ఏంటి? ఆయన నవలల్లో రాసిన సంఘటనలు నిజ జీవితంలో ఎందుకు వెంటాడుతుంటాయి? తదితర ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానంగా మిగతా కథంతా నడుస్తుంది. ఈ మధ్య కాలంలో తమిళంలో వచ్చిన డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం అనూహ్యమైన మలుపులతో సాగుతుంది.
“OTT Hits | ఈ వారం విడుదలైన నాని వెబ్‌సిరీస్‌ను చూశారా?”