మీట్ క్యూట్ (వెబ్ సిరీస్)
సోనీ లివ్: నవంబర్ 24
తారాగణం: వర్ష బొల్లమ్మ, రుహానీ శర్మ, ఆకాంక్షసింగ్, సత్యరాజ్, అదాశర్మ
దర్శకత్వం: దీప్తి గంటా.
హీరో నాని నిర్మాణంలో రూపొందించిన సిరీస్ ఇది. ఆయన సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించింది. ‘మీట్ ద బాయ్’, ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ ‘ఇన్ లా’, ‘స్టార్ టాక్’, ‘ఎక్స్ గాళ్‌ఫ్రెండ్’ అనే ఐదు కథలతో యాంథాలజీ సిరీస్‌గా తీసుకొచ్చారు. పెండ్లంటే ఇష్టంలేని సాఫ్ట్వేర్ ఉద్యోగినికి (వర్ష బొల్లమ్మ) ఓ అబ్బాయి పరిచయం కావడం, ఇద్దరి ప్రేమ ప్రయాణం, జీవిత భాగస్వామి ఎంపికలో ఇరువురి ఇష్టాయిష్టాల నేపథ్యంలో ‘మీట్ ద బాయ్’ కథ ఆకట్టుకునేలా ఉంది. రుహానీ శర్మ ప్రధాన పాత్రలో భార్యాభర్తల కథగా రూపొందించిన ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ ’ కుటుంబ బంధాల్లోని సంక్లిష్టమైన భావోద్వేగాలకు అద్దం పడుతుంది. ప్రేమలోని సంఘర్షణ ప్రధానంగా సాగే ‘ఇన్ లా’, ఓ హీరోయిన్, డాక్టర్ మధ్య అనుబంధం నేపథ్యంలో నిర్మించిన ‘స్టార్ టాక్స్’ కథలు ఆసక్తికరంగానే సాగాయి. నిర్మాణపరంగా ఉన్నతంగా అనిపించినా అర్బన్ ప్రేక్షకులకే కనెక్ట్ అయ్యే కథలు కావడం చిన్నపాటి మైనస్.
సగం ధరకే జియో బహమతుల ఇస్తామని.. జీవితా రాజశేఖర్‌కు లక్షన్నర టోకరా
pavitra Lokesh | సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేశ్