Macherla Niyojakavargam in OTT | ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం
Macherla Niyojakavargam in OTT | నితిన్ మాచర్ల నియోజకవర్గం తర్వాత వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న కాంతార, గాడ్‌ఫాదర్, పొన్నియన్ సెల్వన్ -1, సర్దార్, ప్రిన్స్.. ఇలా చాలా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Macherla Niyojakavargam in OTT | నితిన్ తన రూట్ మార్చి చేసిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12న విడుదలైంది. కానీ లవర్‌బోయ్ ఇమేజ్‌లో నితిన్‌ను చూసిన జనాలు.. ఇందులో కొత్తగా చూడలేకపోయారు. దీంతో బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా గ్లామర్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. దీంతో థియేటర్ల నుంచి తొందరగానే సినిమా వెళ్లిపోయింది. అయితే థియేటర్లో చూడటం మిస్సయిన నితిన్ ఫ్యాన్స్ మాత్రం.. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా ఓటీటీలోకి వచ్చే డేట్ కన్ఫార్మ్ అయిపోయింది.
ఈరోజుల్లో థియేటర్లో సినిమా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం తర్వాత వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న కాంతార, గాడ్‌ఫాదర్, పొన్నియన్ సెల్వన్ -1, సర్దార్, ప్రిన్స్.. ఇలా చాలా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ సినిమా విడుదలై మూడు నెలలు అయిపోయినా కూడా మాచర్ల నియోజకవర్గం ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ కాలేదు. దీంతో నితిన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 9 నుంచి ఈ సినిమా తమ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో ఘోస్ట్ వంటి చిత్రాలు థియేటర్లో నిరాశ పరిచినప్పటికీ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేశాయి. మరి ఆ బాటలోనే మాచర్ల నియోజకవర్గం సినిమా ఓటీటీలో హిట్ అవుతుందో లేదో చూడాలి.
Meet @actor_nithiin aka Reddy garu, Collector of Macherla Niyojakavargam reporting to @ZEE5#MacherlaNiyojakavargamOnZee5 premieres December 9th🥳#MacherlaMassLoading@IamKrithiShetty @CatherineTresa1 @vennelakishore @thondankani @SreshthMovies #SagarMahati pic.twitter.com/3YI17eGRVi
— ZEE5 Telugu (@ZEE5Telugu) November 26, 2022
Read More :
“OTT Hits | నవంబర్ నెలలో రిలీజై హిట్టయిన వెబ్ సిరీస్‌లు చూశారా?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

