OTT Hits | నవంబర్ నెలలో రిలీజై హిట్టయిన వెబ్ సిరీస్‌లు చూశారా?
OTT Hits | బ్రీత్- ఇన్ టూ ది షాడోస్ (వెబ్‌సిరీస్) | ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌లోనూ స్పై థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తున్నది. వాటిలో యుద్ధ నేపథ్యంతో అల్లుకున్న కథలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే కోవకు చెందుతుంది.
OTT Hits | ఊపిరి కొంత బిగబట్టి.. బ్రీత్- ఇన్ టూ ది షాడోస్ (వెబ్‌సిరీస్)
అమెజాన్ ప్రైమ్: నవంబర్ 9
దర్శకత్వం: మాయాంక్ శర్మ.
సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశం ఇది. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన ‘బ్రీత్’ తొలి సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో రెండోభాగంపై ఆసక్తి నెలకొంది. సీజన్ వన్ కథ ముగింపు నుంచి రెండో భాగం మొదలవుతుంది. అవినాశ్ (అభిషేక్ బచ్చన్) మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంటాడు. వరుస హత్యలకు పాల్పడుతున్న అతణ్ని చికిత్స కోసం మానసిక వైద్య శాలలో చేరుస్తారు. అక్కడినుంచి తెలివిగా తప్పించుకున్న అవినాశ్ పదిమందిని చంపాలని ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఇంతకీ ఆ పదిమంది ఎవరు? ఈ హత్యలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి సావంత్ (అమిత్ సదా) ఏం చేశాడు? మరోవైపు తన భర్తను కాపాడుకునేందుకు అభా (నిత్యామీనన్) ఏం చేసింది? అవినాశ్ విశ్వసించే పది తలల రావణాసురుడి ఫిలాసఫీ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. క్రైమ్ థ్రిల్లర్ కథకు ఫ్యామిలీ డ్రామా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముడిపెట్టి నడిపించిన తీరు ఆసక్తికరం. తుదివరకూ వీక్షకులను కట్టిపడేస్తుంది.
వార్ ఇన్”స్పై’ర్ముఖ్బీర్ (వెబ్‌సిరీస్)
జీ5: నవంబర్ 11
దర్శకత్వం: శివమ్ నాయర్, జయ్‌ప్రద్ దేశాయ్.
ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌లోనూ స్పై థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తున్నది. వాటిలో యుద్ధ నేపథ్యంతో అల్లుకున్న కథలు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇదే కోవకు చెందుతుంది.. ముఖ్బీర్. 1965 ఇండియా-పాకిస్థాన్ యుద్ధం కథాంశంగా దీన్ని నిర్మించారు. ఆ యుద్ధంలో భారత విజయానికి గూఢచార వ్యవస్థ ఎలా సాయపడిందనే అంశాలను ఇందులో ఆసక్తికరంగా చూపించారు. కథలోకి వెళ్తే.. ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ పేరుతో కశ్మీర్ లోయతోపాటు భారతదేశ వ్యాప్తంగా విధ్వంసానికి పాకిస్థాన్ వ్యూహ రచన చేస్తుంది. శత్రుదేశపు
పన్నాగాలు తెలుసుకోవడానికి కమ్రాన్ (జైన్ ఖాన్) గూఢచారి అవతారమెత్తి పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. తన తెలివితేటలతో పాక్ ఆర్మీ మేజర్‌ను తప్పుదారి పట్టించి కీలక సమాచారం సేకరిస్తాడు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి మూర్తి(ప్రకాశ్‌రాజ్)కి సమాచారం చేరవేస్తుంటాడు. కమ్రాన్ అందించిన సమాచారం భారత్‌కు ఏ మేరకు ఉపయోగపడింది? పాక్ నిఘా వ్యవస్థ కమ్రాన్ గూఢచర్యాన్ని పసిగట్టిందా? అనే విషయాలను ఆసక్తికరంగా చూపించారు. పాక్‌లో ఉండగా కమ్రాన్ ఓ గాయనితో ప్రేమలో పడతాడు. ఒకవైపు కర్తవ్యం, మరొకవైపు ప్రేమ.. రెండిటి మధ్యా నలిగిపోతాడు. అక్కడక్కడా నెమ్మదించినా ముఖ్బీర్ ఆసక్తికరంగానే సాగుతుంది.
Read More :
Radhika Apte | యంగ్ హీరోయిన్స్‌పై రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్”
“Kantara | కాంతార ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

