Sai Pallavi | సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా?
Sai Pallavi | చివరగా ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుంది.
Sai Pallavi | సాయిపల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. మిగిలిన హీరోయిన్లలా గ్లామర్ పాత్రలను కాకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ తన పాపులారిటీని మెయింటైన్ చేస్తోంది. చివరగా గార్గి చిత్రంతో వచ్చిన సాయిపల్లవి గురించి ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.
చివరగా ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తుంది. దీంతో సాయిపల్లవి సినిమాలను వదిలేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. త్వరలోనే సాయిపల్లవి పెండ్లి చేసుకోబోతుందని.. అందుకే కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. దీంతో కొద్దిరోజులు ఈ వార్తలు సద్దుమణిగాయి. అయితే తాజాగా మళ్లీ సాయిపల్లవి సినిమాలకు దూరంగా కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి మరో కారణం వినిపిస్తుంది.
సాయిపల్లవి డాక్టర్ అని అందరికీ తెలిసిన విషయమే. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన సాయిపల్లవి.. ఇండియా వచ్చిన తర్వాత నటిగా మారింది. మలయాళ సినిమా ప్రేమమ్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్గా మారింది. అయితే ఇప్పుడు తాను అభ్యసించిన వైద్య వృత్తికి న్యాయం చేయాలని సాయిపల్లవి అనుకుంటుందట. అందుకే కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని తెలుస్తోంది. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని.. అందుకే సినిమాలను వదిలేయాలని అనుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Read More :
“Sai Pallavi | నా లవ్ లెటర్ చూసి అమ్మానాన్న కొట్టారు : సాయిపల్లవి”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

