Sai Pallavi | నా లవ్ లెటర్ చూసి అమ్మానాన్న కొట్టారు : సాయిపల్లవి
భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది సాయిపల్లవి (Sai Pallavi). రీసెంట్గా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
తెలుగు, మలయాళ, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు సాయిపల్లవి (Sai Pallavi). శ్యామ్ సింగ రాయ్ సినిమాతో నార్తిండియా ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ భామ. భాష, హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. రీసెంట్గా రానాతో కలిసి విరాటపర్వం (Virata Parvam) సినిమా చేసింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్‌ను అందుకోలేకపోయినా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రంలో రవన్న తల్లి రాసిన ఉత్తరాన్ని అతన్ని కలిసి అందించేందుకు వెన్నెల చాలా రిస్క్ చేస్తుంది. అయితే నిజజీవితంలో లవ్ లెటర్ (love letter) ఏదైనా రాసే ప్రయత్నం చేశారా..అన్న ప్రశ్నపై ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ..చిన్ననాటి సంఘటన ఒకటి షేర్ చేసుకుంది..సాయిపల్లవి స్కూల్ స్టేజ్‌లో ఓ అబ్బాయికి రాసిన లవ్ లెటర్ ఆమె తల్లిదండ్రుల కంట పడిందట. నా చిన్న తనంలో ఓ అబ్బాయికి లేఖ రాశాను. అపుడు నేను ఏడో తరగతిలో ఉన్నాననుకుంటా. ఈ విషయం తెలిసి అమ్మానాన్న నన్ను చాలా బాగా కొట్టారు.
సాయిపల్లవి ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది. గౌతమ్ రామచంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో స్కూల్ టీచర్‌గా కనిపించనుంది. జులై 15న థియటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విరాటపర్వం జులై 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతోంది.
Read Also : Nithiin | మోకాలికి గాయమైనా అంజలి డ్యాన్స్ చేశారు : నితిన్
Read Also : Mahesh Remuneration | రెమ్యునరేషన్ పెంచేసిన మహేశ్..క్రేజీ న్యూస్ నిజమేనా.. !
Read Also : Krishna Vamsi | ఏడెనిమిది సార్లు ఏడ్చేసిన కృష్ణవంశీ..ఎందుకంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

