కడ్తాల్, జూన్ 2 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ప్రియ, రమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.