కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పిలుపు నిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేడే జెండాను ఎగురవేశారు.
వికారాబాద్, (నమస్తే తెలంగాణ) మే 1 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ పిలుపు నిచ్చారు. కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ నిర్వీర్యం చేస్తున్న దని, బడా పారిశ్రామిక వేత్తలకు అనుగుణంగా కార్మిక చట్టాలను మార్చిందని విమర్శిం చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని, దీనివల్ల రిజర్వేషన్లు పోవడం తో పాటు లక్షలాది మంది కార్మికులు వీధినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కార్మికులు, ఉద్యోగ పక్షపాతిగా ఉంటూ వారి జీతాలను పెం చారని గుర్తు చేశారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు టైగర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కృష్ణయ్య అన్నారు. డీసీఎంఎస్ గోడౌన్ ముందు హమాలి యూనియన్ అధ్యక్షుడు మేడే జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమేశ్, బీఆర్టీయూ వికారాబాద్ ఇన్చార్జ్ కృష్ణ, టీఆర్ఎస్వీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్, మున్సిపల్ యూనియన్ నాయకుడు దావూద్, వెంకట్, పురుషోత్తం, దేవయ్య, రాములు,బందెయ్య తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాదాన్ని తిప్పికొట్టి దేశాన్ని కాపాడుకుందాం
పరిగి: మేడే స్ఫూర్తితో మతోన్మాదాన్ని తిప్పికొట్టి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మేడే సందర్భంగా పరిగిలోని కొడంగల్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడంతోపాటు లేబర్ అడ్డా వద్ద సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధిం చుకున్న 8 గంటల పనిదినాన్ని కేంద్ర ప్రభుత్వం 12 గంటలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు లేదన డం అన్యాయమన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం, మధ్య తరగతి, పేదలపై ముప్పేట దాడి చేస్తుందన్నారు. మరోవైపు మతాల మధ్య ఘర్షణలు పెట్టి దేశాన్ని అల్లకల్లోలం చేయాలని కుట్రలు పన్నుతుందన్నారు. వాటన్నింటినీ ప్రజలు మే డే స్ఫూర్తితో తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కన్వీనర్ ఎం.డి.హబీబ్, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ, పరిగి ప్రాజెక్టు అధ్యక్షురాలు మంజుల, సీపీఎం నాయకులు రఘురాం, లాలయ్య, కిష్టయ్య, నరేశ్, రమేష్, జంగయ్య, పార్వతమ్మ, శ్రీనివాస్, రామచంద్రయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.
కొడంగల్పట్టణంలో..
కొడంగల్ : మేడే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిల నుంచి వినాయక కూడలి వరకు స్పూర్తి భవన నిర్మాణ కార్మికులు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో కార్మిక జెండాను ఎగురవే శారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఐనాన్పల్లి చిన్న వెం కటయ్య, తాండ్ర రాములు, తూంరాములు, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సచంద్రయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అంబేద్కర్ చౌరస్తాలో జెండాను ఆవిష్కరించారు.
వికారాబాద్ పట్టణంలో..
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని మహావీర్ స్టాక్ మెడికల్ సైన్స్ అండ్ జనరల్ దవాఖానలో హిందూమజ్జూర్ సభ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహావీర్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రామకృస్ణ హెచ్ఎంఎస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్మిక లోకమంతా సంఘటితమై పోరాడవలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ ఆర్గనైజర్ కొంద పల్లి రాజు, యాదగిరి, రాజు, రజిత, మంజూల, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు , ఉద్యోగులు పాల్గొన్నారు.
మర్పల్లి మండలంలో..
మర్పల్లి: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఏఈ పూర్ణచంద్ర సిబ్బందితో కలిసి జెండాను ఆవి ష్కరించారు. కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ నరేశ్, విద్యుత్ సిబ్బంది మోహన్, కృష్ణ, చంద్రశేఖర్, జలీల్, పోచయ్య, పెంటయ్య, యాదగిరి, ప్రభాకర్‌రెడ్డి, ఖాజపాఫా, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

