Road Accident | ఆమనగల్లు, జూన్ 22 : ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తూజపల్లి గ్రామానికి చెందిన కాలే మహేందర్నాథ్ (24) మృతి చెందినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కల్వకుర్తి నుండి పత్తిలోడుతో మధ్యప్రదేశ్ వెళుతున్న లారీ అదే రూట్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహేందర్నాథ్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద పడి మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాటన్మిల్లు వద్ద జరిగిన సంఘటన చూసి మృతదేహం వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.5వేలు అందజేశారు. అదే విధంగా మాజీ ఎంపీటీసీ నిట్ట నారాయణ రూ. 5వేలు అందజేశారు.