మొయినాబాద్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య ( Youth Suicide) చేసుకున్న ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన చిట్టెంపల్లి యాదయ్య కుమారుడు చిట్టెంపల్లి దాసు ( Das ) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందులను ( Financial difficulties )తాళలేక శుక్రవారం పురుగుల మందు సేవించాడు. పురుగు మందు సేవించిన దాసు వాంతులు చేసుకుంటుండగా వెంటనే దవాఖానకు తరలించారు. ఉస్మానియా దవఖానలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.