గండీడ్ ఆగస్టు 19: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక యువకుడిపై చిరుత పులి (Leopard) దాడి చేసింది. సాయంత్రం ఇంటికి వెళ్తుండా నరేష్‌పై చిరుత దాడికి పాల్పపడడం కలకలం రేపింది. గండీడ్ మండల పరిధిలోని లింగాయపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం5.30 గంటల సమయంలో రంగారెడ్డి పల్లి నుండి సొంత గ్రామం లింగయ్య పల్లికి వెళ్తున్నాడు నరేష్.
అయితే.. గ్రామ సమీపంలోని చింత గుట్ట దగ్గర ఉన్న మైసమ్మ గుడి పక్క నుండి అకస్మాత్తుగా ఏదో జంతువు తనపై దూకిందని.. ఏంటని చూసేలోపే అది గబుక్కున చెట్లలోకి వెళ్లిందని నరేష్ తెలిపాడు. భుజంపై ఏర్పడిన గాయంను బట్టి అది చిరుత పంజాలా ఉందని బాధితుడు తెలిపాడు. దాంతో, చింతగుట్ట ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న పశువులు రైతులు రాత్రిపూట కాపలా వెళ్లేందుకు జంకుతున్నారు.