రంగారెడ్డి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతున్నది. బుధవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ్వంసం చేయగా.. గురువారం ఫార్మాసిటీలోని మేడిపల్లి గ్రామంలో హి టాచీ, జేసీబీలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి రీసర్వే పనులు చేపట్టా రు.
కోర్టులో స్టే ఉన్నా తమ భూముల్లో సర్వే చేయడంతోపాటు హద్దులను ఎలా ఏర్పా టు చేస్తారని రైతులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు రైతులను పక్కకు నెట్టి పనులను చేపట్టారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకోగా.. వారందరినీ ఠాణాలకు తరలించారు.
ఎన్నికలప్పు డు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ..అధికారంలోకి వచ్చి పదవులు దక్కగానే.. తమను పట్టించుకోవడం లేదని..కోర్టు స్టే ఇచ్చిన భూముల్లో రీసర్వే చేయొద్దని ప్రాధేయపడుతున్నా పోలీసులతో అరెస్టు చేస్తు న్నారని.. ఇంత జరుగుతున్నా ఆ ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.