నవాబుపేట,డిసెంబర్ 26: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా బాగుం టుందనే సదుద్ధేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా గర్భిణులకు ‘న్యూట్రి షన్ కిట్ల’ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గర్భిణుల్లో పోషకాహారం, రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకే డాక్టర్ల బృందం అవగాహన కల్పించి కిట్లను పంపిణీ చేస్తు న్నది. నవాబుపేట మండలంలో సబ్ సెంటర్ల వారీగా…చించల్‌పేట 10, చిట్లిగిద్ద 16, ఏక్మామిడి 22, గేట్‌వనంపల్లి 16, గంగ్యాడ 13, మాదిరెడ్డిపల్లి 11, నవాబుపేట16, పులిమామిడి 17, యెల్లకొండ 17, మొత్తం 138 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. నవాబుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి ప్రసాద్ ప్రతి ఒక్కరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి కిట్‌లో ఉన్న ప్రతి దానిపై అవగాహన కల్పించిన తర్వాతనే లైవ్ ఫొటోస్ తీసుకుని అందజేశారు.
కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించడానికి దవాఖానకు వచ్చిన స్థానిక శాసన సభ్యుడు కాలె యాదయ్య కూడా కిట్ల ప్రాముఖ్యత గూర్చి వివరించారు. జిల్లా వైద్యాధికారుల ఆదేశాలను పాటిస్తూ 14వారాల నుంచి 27 వారాలు ఉన్న వారికి మాత్రమే నవాబ్‌పేట ఆరోగ్య కేంద్రంలో కిట్లను పంపిణీ చేసి ఆపైన ఉన్న వారిని జిల్లా కేంద్రం దవాఖానాలో తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. సబ్ సెంటర్లల్లో పనిచేసే ఏఎన్ఎంలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ గర్భిణులకు కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఆర్థిక సాయాన్ని చేస్తున్నట్లుగానే గర్భందాల్చిన నాటినుంచి ప్రభుత్వం ఉత్తమ సేవలను అందజేస్తున్నది. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్లు, ఆర్థిక సాయాన్ని అందజేస్తూ ప్రస్తుతం ‘న్యూట్రిషన్ కిట్ల’ను పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి మహిళలపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నది. ఒక్కో కిట్టులో రూ. 1962 విలువ చేసే వస్తువులను ఉన్నాయి.
ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ..
మండలంలో ఉన్న ప్రతి గర్భిణి కూడా న్యూట్రిషన్ కిట్టు తీసుకు నేలా ప్రోత్సహిసున్నాం. మండలంలోని సంబంధిత సబ్ సెంటర్ల లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు కిట్‌లో ఉన్న వస్తువుల గూర్చి అవగా హన కల్పిస్తున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగిని కూడా ప్రేమతో పలుకరిస్తూ వారికి కాల్సిన ట్రీట్మెంట్ను అందజేస్తున్నారు.
– డాక్టర్ ప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి నవాబుపేట
చాలా ఆనందంగా ఉంది…
నాది మారుమూల గ్రామం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు అమలు జేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఇంతమంచి ఆరోగ్యపరమైన కిట్లను అందజేయడం నమ్మలేకపోవతున్నాను. నాకు మొదటిసారి న్యూట్రిషన్ కిట్ అందడం, ఏడు రకాల పోషకాహారాలు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. – నవనీతా, గర్భిణి మాదారం గ్రామం