వికారాబాద్, అక్టోబర్ 3: వయోవృద్ధులను గౌరవించే బాధ్యత మనందరిదని జిల్లా మహిళాశిశు , దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం అంత ర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్ లోని కాన్ఫ రెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధుల దశ అనేది చాలా గొప్ప దశ అని వీరిని గౌరవించటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం సంయుక్తంగా14567 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసిందని, ఇది ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు.జిల్లాలో మొత్తం వయోవృద్ధులు 1,09, 658 ఉన్నారని, వారిలో 41,033 వయోవృద్ధులకు నెలకు 2,016 చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. వయోవృద్ధుల సమస్యల సత్వర పరిష్కారం కొరకు TS senior citizens.cgg.gov.in అనే వెబ్ సైట్ ను ప్రారం భించినట్లు తెలిపారు.
జిల్లాలో వయోవృద్ధులకు ఆదరణ , వసతి కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక వృద్ధాశ్రమం కొత్తగడిలో నిర్వహిస్త్నుట్లు తెలిపారు. సమాజంలో చాలా మంది కుటుంబంలోని పిల్లల వల్ల నిర్లక్ష్యం వలన వయో వృద్ధులను ఎవరు పట్టించుకోవడం లేదని, వయోవృద్ధులకు ఎటువంటి సమస్య వచ్చినా తమశాఖను సంప్రదించాలని సూచించారు.
వయోవృద్ధుల సహాయం, సమస్యల పరిష్కా రానికి టోల్ ఫ్రీ నెంబర్ 124567కైనా ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సంగమేశ్వర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మెహరున్నీసా బేగం, కాంతారావు , ప్రవీణ,వెంకటేశ్వరమ్మ, రజిత, సీనియర్ అసిస్టెంట్, జహీరుద్దీన్, రాములు, ఎఫ్ ఆర్ ఓ వెంకటేష్ , మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది , జిల్లా లోని వయోవృద్ధులు పాల్గొన్నారు.