రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటుతున్నా.. ఆసరా పింఛన్లను పెంచక పోవడంతో లబ్ధిదారులు ఎప్పుడు పెంచుతారా.. అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తాము అధికా రంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు తదితరులకిచ్చే రూ.2,016 పింఛన్‌ను రూ. 4,000, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000 పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పవర్లోకి రాగానే ఆ మాటను మరిచిపోయారు.
లబ్ధిదారులకు ఇప్పటికీ కేసీఆర్ హయాంలో అందిన మొత్తమే పంపిణీ అవుతుండడంతో రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా పింఛన్ల పంపిణీలోనూ జాప్యం జరుగుతున్నదని, సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను నవంబర్ నెలలో ఇస్తున్నారని.. ఇలా ఇస్తే తాము ఎలా బతకాలని పండుటాకులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -వికారాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటుతున్నా పేదలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. కేవలం ఆరు గ్యారెంటీలకు సంబంధించినవే ప్రస్తావిస్తూ మిగిలిన వాటి ఊసే ఎత్త డం లేదు. తాము అధికారంలోకి రాగా నే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకిచ్చే ఆసరా పిం ఛన్లను రూ.2,016 నుంచి రూ. 4,000, దివ్యాంగులకు ఇచ్చే రూ. 4,016 పింఛన్‌ను రూ.6,000 పెంచుతామని హామీ ఇవ్వగా.. వారి మా టలు నమ్మిన ప్రజలు ఓటేసి గెలిపించారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా పింఛన్ల పెంపు లేకపోవడంతో లబ్ధిదారులు ఎప్పుడు పెరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎక్కడికెళ్లినా పింఛన్ల పెంపుపై ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికీ పాత పింఛన్ డబ్బులనే పంపిణీ చేస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ హ యాం లో ప్రతినెలా మొదటి వారంలోగా ఆసరా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులను పంపిణీ చేయగా.. ప్రస్తుతం 40 రోజులు ఆలస్యంగా డబ్బులు అందుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆరు గ్యా రెంటీల అమలుకు తెల్లరేషన్ కార్డును తప్పనిసరి చేయడంతో చాలామంది పేదలకు పథకాల ఫలాలు అందడం లేదు. రైతుల నుంచి మొద లుకొని అన్ని వర్గాలకు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో విఫలమైందని మండిపడుతున్నారు.
పింఛన్ల పంపిణీలో జాప్యం..
ఆసరా పింఛన్‌తోనే బతుకుతున్న పండుటాకు లు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే అవస్థలు మొదలయ్యాయి. ప్రతినెలా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతున్నది. జిల్లాలోని వికారాబా ద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోని లబ్ధి దారులకు పింఛన్ డబ్బుల పంపిణీ ప్రతినెలా 29 లేదా 30న ప్రారంభమై వారం రోజుల్లో పూర్తవుతుండగా.. కొడంగల్ సెగ్మెంట్లోని పిం ఛన్దారులు మాత్రం డబ్బుల కోసం మొదటి వారం పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా మొదటి వారంలోగా పింఛన్లను అం దజేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే ఆసరా పింఛన్ల పంపి ణీ ఆలస్యంగా జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో అందాల్సిన సెప్టెంబర్ నెల పింఛన్ డబ్బులు నవంబర్ మొదటి వారంలో పంపిణీ చేస్తుండడంపై లబ్ధిదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గానికి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆసరా పింఛన్ల నిమిత్తం నిధులు మంజూరు అవుతుండగా.. వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నా యి. కాగా జిల్లాలో 98,793 మంది పింఛన్‌దారులుండగా వారికి ప్రతినెలా రూ.24,38 కోట్ల పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ..
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్ డబ్బులను పెంచిం ది. వృద్ధులు, వితంతువులు తదితరులకిచ్చే రూ.200 పింఛన్‌ను రూ.1,000, దివ్యాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను రూ.1,500, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రూ.1,000 నుంచి రూ.2,016, దివ్యాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ. 3016కు..
తదనంతరం దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు గతేడాది జూన్‌లో దివ్యాంగుల పింఛన్‌ను రూ.4,016లకు పెంచి పేదల ప్రభుత్వం గా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. బీఆర్ఎస్ హయాం లో జిల్లాలో పింఛన్లకోసం రూ.1,100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ల నిమి త్తం అప్పటి ప్రభుత్వాలు నెలకు కేవలం రూ.2 కోట్లు ఖ ర్చు చేయగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మొదట నెలకు రూ.12కోట్ల మేర ఖర్చు చేయగా.. తదనంతరం పింఛన్ డబ్బులు రెట్టింపు కావడంతో నెలకు రూ.26 కోట్ల మేర వెచ్చించింది.
రూ. నాలుగు వేల పింఛన్ రావడం లేదు
కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినట్లుగానే ప్రతినెలా రూ.2,016 పింఛన్ వస్తున్నది. అది కూడా సక్రమంగా రావడం లేదు. ఎన్నికల్లో విజయం సాధించగానే ఆసరా పింఛన్‌ను రూ.నాలుగు వేలకు పెంచి ఇస్తామని గొప్పలు చెప్పి, ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ నాయకులు మోసం చేశారు. ఆ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 11 నెలలు దాటుతున్నా ఇప్పటివరకు రూ. నాలుగు వేల పింఛన్ రావడం లేదు. చేత కాకుంటే హామీలు ఇవ్వొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పిం ఛన్ కరెక్టు టైంకు వచ్చేది. సీఎంగా కేసీఆర్ ఉంటేనే రాష్ట్రంలోని అందరికీ మంచి జరుగుతుంది.
-జుబేదాబి , కోటమర్పల్లి, మర్పల్లి
హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం
ప్రజలకు మాయమాటలు చెప్పి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైనది. ఎన్నికల్లో విజయం సాధించగానే ఆసరా పింఛన్‌ను రూ. నాలుగు వేలకు పెంచి ఇస్తామని చెప్పి.. ఇప్పటికీ పంపిణీ చేయడంలేదు. చేత కాకుంటే హామీలు ఇవ్వొద్దు.
-పలమంటి నర్సింహులు, కోటమర్పల్లి, మర్పల్లి