Shadnagar | షాద్‌నగర్‌టౌన్ : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఫరూఖ్‌నగర్ మండలానికి సంబంధించిన లద్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఆడబిడ్డల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు చేకూరులే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ సందర్భంగా 168మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ పార్థసారథి, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్, ఎంపీడీవో బన్సీలాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు చెన్నయ్య, శ్రీకాంత్‌రెడ్డి, బస్వం, భార్గవ్‌కుమార్, జమృత్‌ఖాన్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.