యాచారం, మే 23 : ఓ పక్క వేసవిలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరో పక్క అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరంతా వృథాగా పోతున్నది. మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా జేసీబీ తగలడంతో మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. దీంతో గత రెండు రోజులుగా తాగునీరు ఏరులై పారుతున్నది.
అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై ప్రవహిస్తున్నది. మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లితండా, బొల్లిగుట్టతండా, మేడిపల్లి గ్రామాల్లో తాగునీరు సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. మల్కీజ్గూడలో పైపులైన్ పగిలి నీరంతా వృథాగా పోగా ఆ గ్రామంలో నే మరోచోట ఎయిర్వాల్వ్ లీకేజీతో నీరు వృథాగా పోతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదు.