FIFA World Cup | ఎంబాపే రికార్డు వృథా.. సాకా హ్యాట్రిక్.. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్
FIFA World Cup | ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కిలియన్ ఎంబాపే రికార్డు సృష్టించినప్పటికీ.. ఫ్రాన్స్‌కు ఓటమి తప్పలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా మూడో స్థానం కోసం జరిగిన పోరులో 6-4తో ఫ్రాన్స్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
FIFA World Cup | ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కిలియన్ ఎంబాపే రికార్డు సృష్టించినప్పటికీ.. ఫ్రాన్స్‌కు ఓటమి తప్పలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా మూడో స్థానం కోసం జరిగిన పోరులో 6-4తో ఫ్రాన్స్‌ను మట్టికరిపించిన ఇంగ్లండ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుకాయో సాకా హ్యాట్రిక్‌తో చెలరేగగా.. డెక్లాన్ రైస్, ఎజ్రీ కాన్సా, జూడ్ బెల్లింగ్‌హామ్ చెరో గోల్‌తో చెలరేగి ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించారు. అయితే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ కాంస్య పతకం గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1966లో విజేతగా నిలిచిన ఆ జట్టుకు ఇప్పుడు మళ్లీ ప్రపంచ కప్ పతకం దక్కింది.
ఫస్టాఫ్‌లోనే మ్యాచ్‌పై పట్టు
ఆట మొదలైన మూడో నిమిషంలోనే డెక్లాన్ రైస్ గోల్ చేసి ఇంగ్లండ్‌కు ఆధిక్యం అందించాడు. 18వ నిమిషంలో ఎజ్రీ కాన్సా హెడ్డర్‌తో స్కోర్‌ను 2-0కు పెంచాడు. ఫ్రాన్స్ తేరుకునేలోపే బుకాయో సాకా 37వ నిమిషంలో గోల్ నమోదు చేశాడు. తొలి అర్ధభాగంలోని బోనస్ టైమ్‌లో మళ్లీ సాకా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంతో విరామ సమయానికి ఇంగ్లండ్ 4-0 తేడాతో పటిష్ట ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్‌లో చెలరేగిన ఎంబాపే
రెండో అర్ధభాగంలో ఫ్రాన్స్ పుంజుకుంది. 48వ నిమిషంలో కిలియన్ ఎంబాపే గోల్ చేసి ఖాతా తెరిచాడు. 54వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ చేయడంతో విజయంపై ఫ్రాన్స్‌లో ఆశలు చిగురించాయి. 67వ నిమిషంలో ఎంబాపే మరోసారి గోల్ చేసి స్కోర్‌ను 4-3కు చేర్చాడు. ఈ గోల్‌తో ప్రపంచ కప్‌లో మొత్తం 22 గోల్స్ పూర్తి చేసిన ఎంబాపే.. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఈ టోర్నీలో తన గోల్స్ సంఖ్యను 10కి చేర్చి గోల్డెన్ బూట్ రేసులోనూ అగ్రస్థానంలో నిలిచాడు.
స్కోర్‌ను సమం చేసేందుకు ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్న సమయంలో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని సాకా సద్వినియోగం చేసుకుని హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అదనపు సమయంలో ఫ్రాన్స్ తరఫున ఔస్మాన్ డెంబెలే గోల్ చేసినా.. మ్యాచ్ ముగిసే ముందు జూడ్ బెల్లింగ్‌హామ్ మరో గోల్‌తో ఇంగ్లండ్‌కు విజయాన్ని అందించాడు. అలా చివరకు 6-4 తో విజయం సాధించిన ఇంగ్లండ్ ప్రపంచకప్‌ను మూడో స్థానంతో ముగించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

