కందుకూరు, సెప్టెంబర్ 28 : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తగూడ గ్రామ సమీపంలో గల పౌల్ట్రీ ఫాలను ఎత్తివేయాలని గ్రామాస్తులు డిమాండ్ చేశారు. సోమవారం పంచాయతీ కార్యలయం వద్ద పంచాయతీ కార్యదర్శి శ్రీహరికి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టరు సామ ప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ రాయిచెట్టు యాదయ్య, సౌడపు శేఖర్ గౌడ్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..గ్రామాలకు దూరంగా ఉండాల్సిన పౌల్ట్రీ ఫాం గ్రామానికి సమీపంలో ఉండడంతో విపరీతంగా దర్వాసన వస్తుందన్నారు.
చని పోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టకుండా ఎక్కడపడితే అక్కడ వేయడంతోదుర్వాసనతో పాటు ఈగల సంచారం ఎక్కువైందందని, దీంతో గ్రామస్తులు అనేక వ్యాధులకు భారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. పౌల్ట్రీ యజమాని మద్ది లక్ష్మారెడ్డికి ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు హనీ కలిగిస్తున్న పౌల్ట్రీ ఫాంలను తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ పక్షంలో పెద్ద ఎత్తున ఆందోలన చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో మాజీ వార్డు మెంబర్లు హన్మంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, ఎండీ అంజద్, యాదగిరి గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.