వికారాబాద్, జులై 7 : విద్యార్థులు స్కాలర్షిప్ అడిగితే అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై. గీత సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. అరెస్టు చేసిన నాయకులను, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రూ.7,200 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్తున్న పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులను, వారిపై లాఠీచార్జీని ఖండించారు.
ఏడవ గ్యారంటీ ప్రజాస్వామిక హక్కు అని చెప్పిన రేవంత్ రెడ్డి విద్యార్థులపై ఉక్కుపాదం మోపి లాఠీ చార్జీ చేసి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకించారు. అరెస్టు చేసిన విద్యార్థి సంఘం నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాన్నారు.