తాండూరు, సెప్టెంబర్ 27: బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పేద, మధ్య తరగతి మహిళల కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, స్థానిక కౌన్సిలర్లతో కలిసి అర్హులైన మహిళలకు చీరలను అందజేశారు.
నవాబుపేట మండలంలో…
నవాబుపేట, సెప్టెంబర్27: నవాబుపేట మండలంలోని ఓ ఫంక్షన్హాల్లో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి. పీఏసీఎస్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, ఎంపీ టీసీలు విజయ్, దయాకర్‌రెడ్డి, సర్పంచులు వెంకట్‌రెడ్డి, రత్నం, యశోద, బల్వంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, విజయలక్ష్మి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆసిరెడ్డిగారి రంగారెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి, లింగంపల్లి రంగారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్ పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 27 : టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మెట్లకుంట, బురాన్‌పూర్, సాలిండాపూర్ గ్రామాల్లో మహిళలకు వారు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ మాట్లాడారు. చిల్ముల్మైలారంలో సర్పంచ్ లక్ష్మికాంత్‌రెడ్డి, ఎక్కచెరువుతండా సర్పంచ్ కమ్లీబాయి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు నారాయణ, లక్ష్మీ, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు రవిగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశ్యానాయక్, రమణారెడ్డి, టీటీ రాములు, విఠల్ నాయక్, బండ శ్రీనివాస్, సంగప్ప, యాదయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
పల్లెపల్లెనా చీరల సంబురం
బంట్వారం : మండల కేంద్రంలో పలువురికి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్య క్రమంలో సర్పంచ్ లావణ్య, డీలర్ నర్సింహులు, నాయకులు ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దోమ: దోమ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయగా, బ్రాహ్మణపల్లి,బట్లచందారం,రాకొండ,కిష్టాపూర్ తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు జగని వెంకటయ్య,రాములు,చాపల వెంకటమ్మ, సత్యమ్మ నర్సింహులు వారి వారి గ్రామాలలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో టిఆర్ఎస్ యువ నాయకుడు మచ్చేందర్‌రెడ్డి,పంచాయితీ కార్యదర్శులు, డీలర్లు,వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
పెద్దేముల్: జనగాం గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను సర్పంచ్ ఎం. రుక్మి ణమ్మ పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ పార్వతమ్మ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముకుంద్ రెడ్డి, హరిసుధన్రెడ్డి, డీలర్ చందు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వికారాబాద్, సెప్టెంబర్ 27: వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయం లోని రవీంద్ర మండపంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే ఆనంద్ పంపిణీ చేశారు. అలాగే వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన రవికి దళిత బంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, రైతు బంధు కో ఆర్డినేటర్ రాంరెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
చీరలను సజావుగా పంపిణీ చేయండి : ఎంపీపీ
పరిగి టౌన్, సెప్టెంబర్ 27 : బతుకమ్మ చీరలను గ్రామాల్లో సజావుగా పం పిణీ చేయాలని ఎంపీపీ కరణం అరవింద్‌రావు సూచించారు. మంగళవా రం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ ఈ నెల 29 నుంచి అన్ని గ్రామాల్లో అర్హులైన మహిళలకు బతు కమ్మ చీరలను గ్రామ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో కలిసి పంపిణీ చేయాలని సూచించారు. గ్రామా లవారీగా స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరిశర్మ, తహసీల్దార్ రాంబాబు, ఉప తహసీల్దార్ నర్సింహారెడ్డి, ఎంపీవో దయా నంద్, ఏపీఎం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు బతుకమ్మ చీరల పంపిణీ
కోట్‌పల్లి సెప్టెంబర్ 27 బుగ్గాపూర్ రైతు వేదికలో బుధవారం బతుకమ్మ చీరలను తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పంపిణీ చేస్తారని మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ తెలిపారు . మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలకు 8540 బతుకమ్మ చీరలు వచ్చినట్లు తెలిపారు.