
మర్పల్లి, జూన్ 4: వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలో నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. వికారాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ప్రభాకర్ గుప్తా, సొసైటీ వైస్ చైర్మన్ ఫసియుద్ధీన్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు సోహెల్, రైతు బంధు మండల అధ్యక్షుడు నాయబ్‌గౌడ్, బట్టు రమేశ్, మండల నాయకులు మధుకర్, అశోక్, రామేశ్వర్, రాచయ్య, అంజయ్యగౌడ్, డైరెక్టర్ యాదయ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు గఫార్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బంట్వారంలో..
బంట్వారం, జూన్ 4: మండల కేంద్రంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక పీఏసీఎస్ భవనం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గంచెర్వు మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ రాములు యాదవ్ తదితర టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామంలోని పేదలకు పండ్లు, స్థానిక పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింహులు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
కోట్‌పల్లిలో..
కోట్‌పల్లి, జూన్ 4: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదిన వేడుకలను ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం దవాఖానలోని డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, సిబ్బందికి, పోలీసు అధికారులకు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యులు, పోలీసులకు అన్నదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ఆనంద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉమాదేవి, ఎంపీటీసీ బందెయ్య, పీఏసీఎస్ చైర్మన్ సుధాకర్‌గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు సత్యం, సర్పంచులు నక్కల విజయలక్ష్మి, రామచంద్రయ్య, మల్లయ్య, నాయకులు రాములు, దశరథ్‌గౌడ్, మోహన్, బందెయ్య, పతంగి పాండు, మహేందర్, అన్వర్, రాజు, మైబు, ఏసు, సాదత్, కరీం, రషీద్, బందెయ్య, బల్వంత్, రాజు ఉన్నారు.
ధారూరు మండలంలో..
ధారూరు, జూన్ 4 : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యునూస్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేశం, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజుగుప్త, సర్పంచులు చంద్రమౌళి, శ్రీకాంత్ రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు వెంకటయ్య, గౌరప్ప, దావూద్, నాగేశ్‌గౌడ్, భీంసేన్ రావు, జానీ, రాములు, సుధాకర్ గౌడ్, లక్ష్మయ్య, బసవరాజ్, ఫజిల్, సయ్యద్‌బాబా, ఇస్మాయిల్, హఫీజ్, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.