ధారూరు, జూలై 06 :కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి సందడి చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు.
పర్యాటకులు కుటుంబ సమేతంగా బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అనంతరం ఫొటోలు, సెల్ఫీలు దిగి చెట్ల కింద కూర్చొని వనభోజనాలు చేశారు. ఉదయం నుండి సాయంత్రం దాకా సరదాగా గడిపి సాయంకాలానికి తిరిగి తమ తమ గమ్యాలకు చేరుకున్నారు. పర్యాటకులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోటింగ్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.