కులకచర్ల, జూన్ 9 : భూభారతి రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని కులకచర్ల తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
ఈ చట్టం ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలు అధికారులు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో వివిద రకాలుగా ఉన్న భూసమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, నాయకులు జలీల్, అంజిలయ్యగౌడ్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.