కులకచర్ల, జూన్ 6 : కులకచర్ల మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కులకచర్ల ఎస్ఐ రమేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మొదటి సారిగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లడంతో దేవాలయ కమిటీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
దేవాలయంలో రెండు సార్లు పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.