వికారాబాద్, జూలై 7 : టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (హైరింగ్ డి-మార్ట్ కోసం) హైదరాబాద్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం, ఐటిఐ క్యాంపస్ వికారాద్లో జులై 09 బుధవారం ఉదయము 10:30 గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డి-మార్ట్ నందు సుమారు 200 (క్యాషియర్, సేల్స్ అసోసియేట్స్) పోస్టులు ఉన్నాయని వీటికి కనీస వయస్సు 18 నుంచి 24 సంవత్సరం లోపు నిరుద్యోగ యువతీ యువకులు అందరూ అర్హులని పేర్కొన్నారు.
ఈ ఉద్యోగానికి పదవ తరగతి అంతకంటే ఎక్కువ (పాస్ లేదా ఫెయిల్), విద్యా అర్హత కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్నాయని ఈ జాబ్ మేళా ద్వారా ఎంపిక అయినా వారికి నేరుగా ఉద్యోగం కల్పించడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన సూచించారు.