ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల కల నెరవేరింది
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్
షాద్‌నగర్‌టౌన్, మార్చి 16 : ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగుల కల నెరవేరిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ భవనంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయన్నారు. ఉద్యోగం సాధించాలంటే పట్టుదల, కృషి ఉండాలన్నారు. శిక్షణతోనే ఉద్యోగాన్ని సులభంగా సాధించేందుకు వీలుందన్నారు. ఉచిత శిక్షణ తరగతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయని, శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ పొందాలనుకునే వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 8977 56550, 99487372 9ను సంప్రదించాలన్నా రు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, పీఏసీఎస్ చైర్మన్ బక్కనయాదవ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యుడు ఒగ్గు కిశోర్, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సర్వర్‌పాషా, శ్రీనివాస్, నాయకులు జూపల్లి శంకర్, యుగేందర్, నర్సింలు, శేఖర్ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధితో కార్పొరేట్ వైద్యం
సీఎం సహాయనిధితో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన రాజేంద్రస్టీఫెన్కు రూ. 2 లక్షలు, నెహ్రూ నగర్‌కాలనీకి చెందిన పురుషోత్తంచారికి రూ. 60 వేలు, క్రిస్టియన్కాలనీకి చెందిన అఫ్రిన్బేగానికి రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలి
కొత్తూరు రూరల్ : అవార్డు స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మల్లాపూర్ సర్పంచ్ చిర్ర సాయిలుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రావటంతో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సర్పంచ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, రంగారెడ్డి, చెన్నారెడ్డి, లక్ష్మణ్‌నాయక్, మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, భీమేశ్, మోహన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.