బషీరాబాద్, జూన్ 4 : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి- మైల్వార్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిని డబుల్ రోడ్డుగా మార్చే పనులను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సదరు కాంట్రాక్టర్ రోడ్డును ఒక పక్కకు తవ్వి వదిలేశాడు. దీంతో రోడ్డు ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణం చేసేందుకు కూడా వీల్లేకుండా అయ్యింది.
ఈ రహదారిలో రాత్రి సమయంలో ఎదురుగా ఒక వాహనం వస్తే.. ఎటూ తప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా రోడ్డు సరిగ్గా లేకపోవడంతో పలు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానిక ప్రయాణికులు చెబుతున్నారు. గతంలో ఓ ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపారు. రోడ్ల విస్తరణ పనులను ఎలాగూ పూర్తి చేయడం లేదు.. కనీసం రోడ్డు పనులు కొనసాగుతున్నట్లుగా సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.