ముంబై, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ముంబైలో బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ సంఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించడమే కాక, అతన్ని చంపేస్తామని బెదిరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో భయాందోళన నెలకొంది. శనివారం అర్థరాత్రి 12.45 గంటలకు జుహూలో ఉన్న రోహిత్ శెట్టి భవనం వద్దకు వచ్చిన కొందరు దుండగులు మొదటి అంతస్తుపై కాల్పులు జరిపి పరారయ్యారు. అనంతరం ఆ కాల్పులకు తామే కారణమని సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది.ఇది చిన్న ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పుణెలో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.