MLA Sabita Reddy | ఆహ్లాద వాతావరణానికి పార్కులు దోహదం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
MLA Sabita Reddy | కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి (MLA Sabita Reddy )అన్నారు.
బడంగ్పేట్(హైదరాబాద్) : కాంక్రీట్ జంగల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి (MLA Sabita Reddy ) అన్నారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును ఆమె సందర్శించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే ప్రజలు పార్కులను సందర్శిస్తే అక్కడి ఆహ్లాద వాతావరణానికి ఒత్తిళ్లు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. తాను మంత్రిగా దూరృష్టితో పార్కులో క్రీడా పరికరాలను, వాకింగ్ ట్రాక్లాంటి వాటిని ఏర్పాటు చేశానని గుర్తుచేశారు.
పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్నలు, పెద్దలు సేద దీరటానికి ఎంతో ఉపయోగపడతుందని పేర్కొన్నారు. పార్క్లో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించటానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే నియోజకవర్గంలో అర్బన్ పార్కులను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాధి, నాయకులు యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ శంషోద్దీన్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

