జిల్లా వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం
వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం, క్విజ్ పోటీలు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదుగాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల ప్రయోగాలను ఆమె పరిశీలించారు. ముందుగా సైన్స్ పితామహుడు సర్‌సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సైన్స్పట్ల ఆసక్తి పెంచుకుని రాణించాలన్నారు. అనంతరం లైబ్రరీలో పుస్తకాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్‌పల్లి పటేల్‌గూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మానవ శరీర నిర్మాణం, జీర్ణవ్యవస్థ, అంతరిక్ష నమూనాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులను సన్మానించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం గోవర్ధన్, ఉపాధ్యాయులు అరుందతి, వెంకటేశ్, ఆంజనేయులు, సాల్మన్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వివిధ సైన్స్ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. సైన్స్ పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. సీవీ రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాచ్య, విద్యా కమిటీ చైర్మన్ గూడూరు శ్రీను, వైస్ చైర్మన్ దీపిక, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రబీయా, రమేశ్, రాఘవేందర్, జ్యోతి, మురళీ, హరీశ్, మహేందర్, రాంచంద్రయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవం
కేశంపేట : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కేశంపేట, కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులు విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, క్విజ్ పోటీలను నిర్వహించారు. సేవ్ ద ఎర్త్-సేవ్ ద వాటర్‌పై విద్యార్థుల సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమాల్లో హెచ్ఎం రసూల్, మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని చింతపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన మేళాను నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ రకాల ప్రయోగాలను, పుస్తకాలను, విజ్ఞానాన్ని పెంపొందించే ప్రదర్శనలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరై ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో హెచ్ఎం సురేశ్, ఉపాధ్యాయులు సాబేర్, చంద్రశేఖర్, భాగ్యజ్యోతి, సుజాత, స్వప్న, అరుణజ్యోతి, విజయశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను సర్పంచ్ కృష్ణయ్య పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎం సువర్ణ, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, ఎస్ఎంసీ చైర్మన్ బాలునాయక్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతాయని లయన్స్ క్లబ్ చైర్పర్సన్ పద్మావతి అన్నారు. మండలంలోని ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూలోని చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్వచ్ఛ పాఠశాల ప్రిన్సిపాల్ డి రమాదేవి ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హలీమున్నీసా, బంట్వారం ప్రిన్సిపాల్ ఉషారాణి, మోమిన్‌పేట ప్రిన్సిపాల్ అనిత, టీఎస్‌డబ్ల్యూఆర్ ఈఐఎస్ డిప్యూటీ కార్యదర్శి అనంతలక్ష్మి, అకాడమిక్ కో ఆర్డినేటర్ జార్జ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు