బొంరాస్ పేట : బొంరాస్ పేట మండల ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న వినోద్ గౌడ్ పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా వీడ్కోలు కార్యక్రామాన్ని ఇంచార్జ్ ఎంపీడీవో వెంకన్ గౌడ్, కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. శాలువా పూలదండలతో సన్మానించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఎప్పుడో ఒకసారి పదవి విరమణ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్చ్ఆర్డీ హైదరాబాదులో విధులు నిర్వహించి అక్కడి నుంచి మండలానికి గత మే నెలలో ఎంపీడీవోగా వినోద్ గౌడ్ బదిలీపై వెళ్లారు. వినోద్ గౌడ్ వీడ్కోలు కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.