ITI Course Admissions | వికారాబాద్/షాద్‌నగర్ టౌన్, జూన్ 3 : ఐటీఐ కోర్సుల్లో మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశామని వికారాబాద్ జిల్లా కన్వీనర్, వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థినీవిద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
అర్హత గల అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వికారాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర బాబు సూచించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 91774 72488, 85558 65421, 91779 54208 నెంబర్లలో సంప్రదించాలన్నారు. దరఖాస్తు సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించారు. కాగా, ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని షాద్‌నగర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు శిక్షణాధికారి అజయ్‌కుమార్ సెల్ 7416475164, మసూద్ సెల్ నంబర్ 8019263018లను సంప్రదించాలన్నారు.