షాద్‌నగర్ రూరల్ : పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి కొండంత భరోసానిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింలు ఆనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకుంటున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహులు పరిస్థితి విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరావడంతో వెంటనే స్పందించి సీఎం సహాయనిధి ద్వారా లక్ష రూపాయాల ఎల్ఓసిని మంజూరు చేయించి గురువారం నర్సింలు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సీఎం సహాయనిధి ద్వారా పేదలకు మెరుగైనా వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం సహాయనిధి ద్వారా ఎల్ఓసీ అందజేయడంపై సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ ఆహ్మాద్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.