వికారాబాద్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు వడ్ల నందు రూపొందించిన త్యాగాల మట్టిలో పూసిన పున్నమి వో పాటల సీడీని గురువారం హైదరాబాద్లోని మేక వెంకటేశం కన్వెన్షన్ హాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.