Amangallu : విపత్కర పరిస్థితుల్లో.. జర్నలిస్టుల సేవలు స్ఫూర్తిదాయకం

ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరుపతి అన్నారు. ఆదివారం సంస్థ ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లకు కొవిడ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్-19ను దృష్టిలో పెట్టుకొని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించాలని ఆయన కోరారు.
కరోనా మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా పాత్ర ఆమోఘం అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యుల సలహాలు, సూచనలు, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉండే మూఢ నమ్మకాలు, అపోహలను తొలగించడంలో మీడియా గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు వార్తలను అందించడంలో జర్నలిస్టులు ముందు వరుసలో నిలిచారని వారి సేవలు అభినందనీయం అని ఆయన గుర్తు చేశారు. వారు చేసిన సేవలను గుర్తించి సంస్థ తరపున మెడికల్ కిట్టును వితరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి, జర్నలిస్టులు, యూనిస్, మాసుమ్, శేఖర్, ఆజీమ్, అమిద్, నిరంజన్, ఫొటో గ్రాఫర్ కలీం, అల్లాజీ, సంస్థ డైరెక్టర్ స్వప్నపాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

