కులకచర్ల, జూలై 30 : వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బోయిని ప్రభాకర్(38) అనే యువకుడు మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. తోటి స్నేహితుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా పరిషత్ పుట్టపహాడ్ ఉన్నత పాఠశాల 2006-07 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహితుడి అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు.
మిత్రులు రూ.25000 జమ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. కాగా, అంతారం గ్రామంలో తనకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందని భావించిన యువకుడు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇంటి నిర్మాణం చేస్తుకుంటూనే మంగళవారం ఖాళీగానే ఉన్నానని గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో షాద్‌నగర్ పని నిమిత్తం వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. కాగా, మృతునికి భార్య సంతోషతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.