
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఎస్ఎస్ఎన్ (శ్రీ సరస్వతీ నాట్యాలయం) అకాడమి వారు భరత నాట్యం పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుందని, దానిని బయటకు తీసినప్పుడే గొప్ప ఫలితాలు సాదిస్తారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో నైపుణ్యం గల కళాకారులు ఉన్నారని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి కలలను ప్రోత్సహించే బాధ్యత మనందరిదన్నారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, కలలో కూడా ఆసక్తి చూపాలని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, నాయకులు సుభాన్‌రెడ్డి పాల్గొన్నారు.