Vikarabad : శోభాయమానంగా విగ్రహా వార్షికోత్సవం..

యాలాల : కోరిన కోర్కెలు తీర్చె సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో శోభయమానంగా అభయాంజనేయస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:55 గంటలకు ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. కార్యక్రమంలో విగ్రహా దాత తాండూరు వాస్తవ్యులు అనురాధ దత్తురావు అష్టీకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త, దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రవీందర్రావ్ దేశ్ముఖ్ దంపతులు, కుటుంబ సభ్యులు స్వామివారి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అష్టీకర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ భగవంతుని సేవ ఎంత చేస్తే అంతకు పదింతలు మనకు ఇస్తాడన్నారు.
అభయాంజనేయ స్వామి కృపతో గరత్మంతుని విగ్రహా ప్రతిష్టాపన చేయాలని సంకల్పిస్తున్నామన్నారు. భగవత్ సేవలో తరించడం గొప్ప కార్యమన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని సేవలో తరించారు. కార్యక్రమ అనంతరం అన్నధాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఈవో బాల్రాజ్, అక్కంపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

