కులకచర్ల : కార్తీకమాసం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, దేవాలయ కమిటీ డైరెక్టర్ శంకర్ దంపతులు రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం, రుద్రహోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి పాండు, భక్తులు పాల్గొన్నారు.
మందిపల్‌లో ఉమామహేశ్వర వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే..
డాపూర్ మండలం మందిపల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మఠం ప్రమీళ ఇంట్లో నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వ్రతంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో పాటు కులకచర్ల, డాపూర్ మండలాల టీఆర్‌ఎస్‌నా యకులు పాల్గొన్నారు.